
తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
క్యాలీప్లవర్,ఆలూ,టొమాటో ముక్కలు- ఒక్కొక్క కప్పు
బీన్స్ ముక్కలు,బఠాణి- అర కప్పు
అల్లం,వెల్లులి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి- 4 నిలువుగా తరగాలి
జీలకర్ర- 1 టీ స్పూన్
లవంగాలు- 3
ఏలకులు- 4
దాలిచిన చేక్క- 2
కారం,థనియాలపొడి,గరం మసాలాపొడి-ఒక్కొక్క టీ స్పూన్
పసుపు- చిటికెడు
ఉల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు (ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పేస్ట్ చేసుకోవాలి)
పెరుగు,టొమాటో పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
కొత్తీమీర-గార్నిష్ కి సరిపడా
జీడిపప్పు పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయరీ
1.కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసి ఉడికించాలి. పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర,మసాలా దినుసులు,పసుపు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.అల్లం వెల్లులి,కారం,ధనియాలపొడి,ఉప్పు వేసి కలియబెట్టాలి
2. టొమాటో ముక్కలని వేసి 5 నిమిషాల వరకు వేయించి ఉడకబెట్టుకున్న కూరగాయముక్కల్ని వేసి కలిపి మూతపెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.
3. టొమాటొ,ఉల్లి,జీడిపపు పేస్ట్,పెరుగు వేసి కలిపి మూతపెట్టి మగ్గిన తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించి చివరగా గరం మసాలా పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
No comments:
Post a Comment