
కావలసినవి
క్యాప్సికములు - 6
బఠానీలు - అర కప్పు
బెల్లం తురుము-1 టేబుల్ స్పూన్
ధనియాలు- 2 టీ స్పూనులు
తేల్ల నువ్వులు- 2 టీ స్పూనులు
ఎండుమిరపకాయలు- 5
శనగపప్పు- 1 టీ స్పూన్
కొబ్బరి తురుము- 3 టేబులు స్పూనులు
చింతపండు- కొద్దిగా
జీలకర్ర - 1/2 టీ స్పూన్
ఆవాలు- 1 టీ స్పూన్
కరివేపాకు- 1 రెబ్బ
పసుపు- ఛిటికెడు
కారం- 1 టీ స్పూన్
వేరుశనగలు- 2 టీ స్పూనులు
పచ్చిమిరపకాయలు-2
నూనె - 3 టేబులు స్పూనులు
ఇంగువ- అర టీ స్పూన్
ఉప్పు,నూనె - తగినంత
తయారి
1. ముప్పావు కప్పు నీరు పోసి, బఠానీలను ప్రెషర్ కుక్కర్ లో 5 నిమిషాలు ఉడికించాలి.
2. పాను లో 2 టీ స్పూనుల నూనె పోసి వేడయ్యాక, ధనియాలు,నువ్వులు,ఇంగువ,4 ఎండుమిరపకాయలు,శనగపప్పు వేసి వేయించాలి.దింపేసకా కొబ్బరి తురుము,చింతపండు,కరివేపాకు, కలిపి,పావుకప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. పానులో 1 టీ స్పూన్ నూనె వేసి ఆవాలు,జీలకర్ర,1 వేసి ఎండుమిరపకాయ వేసి తరువాత సగానికి చీలికలుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేయాలి.మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.ముక్కల్ని తీసి విడిగా పక్కన పైట్టుకోవాలి.
4. పానులో ఉప్పు,బెల్లం,మసాలా పేస్ట్ వేసి, ఒకటిన్నర నీరు పోసి,ఎక్కువ మంట పై మగ్గనివ్వాలి.
5. మంట తగ్గించి చింతపండు పచ్చివాసన పోయేదాకా మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి.
6. వేరుశనగలు,క్యాప్సికం ముక్కలు వేసి సన్నని మంట పై చిక్కబడేదాకా ఉంచాలి.
No comments:
Post a Comment