
కావలసినవి
బీన్స్ ముక్కలు- 2 కప్పులు
ఆవాలు- 1 టీ స్పూన్
కరివేపాకు- రెండు టేబుల్ స్పూనులు
పసుపు- 1 టీ స్పూన్
కారం- 1 టీ స్పూన్
ధనియాలపొడి- 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయల ముక్కలు- 1 టేబుల్ స్పూన్
కొబ్బరి తురుము- రెండు టేబుల్ స్పూను లు
నూనె- డీప్ ఫ్రై కి తగినంత
టొమాటో- 1
తయారి
1. మూకుడు లో నూనె వేడిచేసి ఆవాలు వెయ్యాలి.చిటపటలాడాక కరివేపాకు,బీన్స్ ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి.
2. ఇప్పుడు పొడులు,పచ్చిమిరపకాయ ముక్కలు,బీన్స్ వేసి ఒక నిమిషం వేయించాలి
3. మూతపెట్టి బీన్స్ మెత్తపడే వరకు ఉడికించాలి.
టొమేటో ముక్కలు,కొబ్బరి తురుము వేసి మరో అయిదు నిమిషల పాటు వేయించాలి.కొత్తిమీరతో గార్నిష్ చేసుకొవాలి.
No comments:
Post a Comment