
తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి
బియ్యం- 2 కప్పులు(కడిగి నానబెట్టుకోవాలి)
పచ్చి కొబ్బరి తురుము- అర కప్పు
ఆలు- 4 తరిగినవి
పచ్చి మిర్చి- 4 నిలువుగా తరగాలి
నెయ్యి- 1 టేబుల్ స్పూన్
జీలకర్ర- 1/2 టీ స్పూన్
లవంగాలు- 8
ఏలకులు- 4
దాలిచిన చేక్క- 4
ఉప్పు- తగినంత
ఎండుమిర్చి-2 (మధ్యకి విరిచి గింజలు తీసేయాలి)
శనగపప్పు- 1 టీ స్పూన్
మినపప్పు- 1/2 టీ స్పూన్
కరివేపాకు- మూడు రెబ్బలు
నీళ్ళు- నాలుగు కప్పులు
తయరీ
1.పాత్రలో నెయ్యి వేడయ్యాక,జీలకర్ర,మినపప్పు,శనగపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
2. పచ్చిమిర్చి,ఎండుమిర్చి,దాలిచిన చేక్క,ఏలకులు వేసి రెండు నిమిషాలు వేయించుకున్నాక,ఆలు ముక్కలు జత చేసి 3 నిమిషాలు పాటు వేయించాలి.
3. వడ కట్టుకున్న బియ్యాన్ని జత చేసి బాగా కలపాలి.కొబ్బరి తురుము,కరివేపాకు,ఉప్పు వేసి కలియబెట్టాలి.
4. నీళ్ళన్ని పోసి కలియబెట్టి,మూత పెట్టి దాదాపుగా 20 నిమిషాల పాటు, అన్నం అయ్యేవరకు ఉడికించి దింపేయాలి.
No comments:
Post a Comment