Your Ad Here

పనీర్ స్టఫ్డ్ బెండి -Paneer Stuffed Bendi

కావలసినవి :
లేత బెండకాయలు - పావుకేజీ
పనీర్-1 కప్పు (సన్నగా తురుముకోవాలి )

టమాటో- 1 పెద్దది (ఫై తొక్క తీసి మిక్సీలో వేసి గుజ్జు చేసుకోవాలి )

కారం- అర టీ స్పూన్

జిలకర్ర- అర టీ స్పూన్
నునే- ౩ టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - తగినంత
తయారీ :
1. బెండాకయలిని కడిగి ఒక క్లాత్ తొ తుడువాలి
2. చివర్ల్లు కట్ చెసుకొని గాట్లు పెట్టుకొవాలి
3. పాన్ లొ టెబులు స్పూన్ నునె పొసి, వెడయ్యాక టొమటొ గుజ్జు, కారం,జిలకర్ర, ఉప్పు, పనీర్ ఒక దాని తరువాత ఒకటి వీసి కలపాలి.
4. అన్ని రెండు నిమిషాలు వెయించి దింపాలి
5. గాట్లు పెటిన బెండాకయల్లొ మిశ్రమాన్ని పెట్టుకొవాలి.ఆడుగు మందంగా ఉన్న మరొ పాన్లొ మిగతా నునె పొసి వెడయ్యాక స్టఫ్డ్ బెండాకయలిని వెసి మూత పెట్టి సన్నని మంట మిద పదిహ్హెను నిమిషాలు వెయించలి మాడకుండా జాగ్రాత్తపడుతూ వెయించి కొత్థిమీర చల్లి దించుకొవాలి.

కోడిగుడ్డు ములక్కాడ



తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి
కోడిగుడ్డులు -6 (ఉడకవెట్టి ఒలిచి నిలువుగా గాట్లు పెట్టుకోవాలి)
ములక్కాడ-1(ముక్కలు చేసి పెట్టుకోవాలి)
ఉల్లిగడ్డలు-
2
టొమాటో-
పెద్దది 1
కారం-
1 టీ స్పూన్
ఉప్పు-
తగినంత
పసుపు-
చిటికెడు
ధనియాల పొడి-
అర టీ స్పూన్
నూనె-
అర టేబులు స్పూన్
కొత్తిమిర -
గారనిష్ సరిపడా
పోపు కోసం:
ఆవాలు-
అర టీ స్పూన్
ఎండుమిర్చి-
ఒకటి
వెల్లులి రెబ్బలు-
4-5
కరివేపాకు-
5 రెబ్బలు
తయారి
1.
పాత్ర వేడెక్కాక కాసింత నూనె వేసి ఉడకపెట్టిన గుడ్లని,పసుపును కూడా జత చేసి కలియభెట్టి రెండు నిమిషాలపాటు రోస్ట్ చేశాక తీసి పక్కన పెట్టుకోవాలి.
2. అదే పాత్రలో,ములక్కాడ ముక్కలిని వేసి ఒక్క నిమిషం పాటు వేయించి వీటిని కూడా పక్కనపెట్టుకోవాలి.
3. మిగతా నూనెని వేసి ఆవాలని వేసి చిటపటలాడించి ఎండుమిర్చి,వెల్లులి రెబ్బలు,కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి.
4. పోపులో ఉల్లిపాయ ముక్కలిని జత చేసి లేత బ్రౌన్ కలర్ వచ్చేదాక వేపుకుని,ఉప్పు,కారం,ధనియాలపొడిని వేసి కలియబెట్టాఅలి.
5. ఇప్పుడు తరిగిపెట్టుకున్న టొమాటో ముక్కలిని,ములక్కాడ ముక్కలిని వేసి కలియబెట్టి మరో 3 నిమిషాలపాటు వేగనివ్వాలి.
6. రోస్ట్ చేసుకున్న గుడ్లని కూడా వేసి కలియబెట్టాఅలి సన్నని మంట పై 2 నిమిషాలు వేగనివ్వాలి.
7. 2 కప్పుల నీళ్ళు పోసి మంటని పెద్దది చేసి గ్రేవీ చిక్కబడేవరకు ఉడకనివ్వాలి.(15 నిమిషాల వరకు)
8. కొత్తిమీర తో గార్నిష్ చేసుకొవాలి.

క్యాప్సికం-బఠానీ కూర



కావలసినవి
క్యాప్సికములు -
6
బఠానీలు -
అర కప్పు
బెల్లం తురుము-
1 టేబుల్ స్పూన్
ధనియాలు-
2 టీ స్పూనులు
తేల్ల నువ్వులు-
2 టీ స్పూనులు
ఎండుమిరపకాయలు-
5
శనగపప్పు-
1 టీ స్పూన్
కొబ్బరి తురుము-
3 టేబులు స్పూనులు
చింతపండు-
కొద్దిగా
జీలకర్ర -
1/2 టీ స్పూన్
ఆవాలు-
1 టీ స్పూన్
కరివేపాకు-
1 రెబ్బ
పసుపు-
ఛిటికెడు
కారం-
1 టీ స్పూన్
వేరుశనగలు-
2 టీ స్పూనులు
పచ్చిమిరపకాయలు-
2
నూనె -
3 టేబులు స్పూనులు
ఇంగువ- అర టీ స్పూన్
ఉప్పు,నూనె -
తగినంత

తయారి
1.
ముప్పావు కప్పు నీరు పోసి, బఠానీలను ప్రెషర్ కుక్కర్ లో 5 నిమిషాలు ఉడికించాలి.
2. పాను లో 2 టీ స్పూనుల నూనె పోసి వేడయ్యాక, ధనియాలు,నువ్వులు,ఇంగువ,4 ఎండుమిరపకాయలు,శనగపప్పు వేసి వేయించాలి.దింపేసకా కొబ్బరి తురుము,చింతపండు,కరివేపాకు, కలిపి,పావుకప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. పానులో 1 టీ స్పూన్ నూనె వేసి ఆవాలు,జీలకర్ర,1 వేసి ఎండుమిరపకాయ వేసి తరువాత సగానికి చీలికలుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేయాలి.మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.ముక్కల్ని తీసి విడిగా పక్కన పైట్టుకోవాలి.
4. పానులో ఉప్పు,బెల్లం,మసాలా పేస్ట్ వేసి, ఒకటిన్నర నీరు పోసి,ఎక్కువ మంట పై మగ్గనివ్వాలి.
5. మంట తగ్గించి చింతపండు పచ్చివాసన పోయేదాకా మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి.
6. వేరుశనగలు,క్యాప్సికం ముక్కలు వేసి సన్నని మంట పై చిక్కబడేదాకా ఉంచాలి.

గుమ్మడికాయ కూర



కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు -
2 కప్పులు
శనగలు-
అర కప్పు
ఆలు ముక్కలు-
1 కప్పు
ఉల్లిపాయ-
1
జీలకర్ర -
1 టీ స్పూన్
పసుపు-
1 టీ స్పూన్
కారం- 1 టీ స్పూన్

పచ్చిమిరపకాయలు-
2
నూనె - 3 టేబులు స్పూనులు
ఇంగువ-
చిటికెడు
చక్కర-
1 స్పూన్
ఉప్పు -
తగినంత

తయారి
1.
పాత్రలో నూనె వేడి చేసి ఇంగువ వెయ్యాలి.
2. ఉల్లిపాయలు వేయించి,గుమ్మడి,ఆలు,పచ్చిమిరపకాయలు,పసుపు,ఉడికించిన శనగలు,కారం వేసి కూరగాయ ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి.
3. చక్కర కలిపి నూనె ముక్కలనుంచి విడిపోయేదాకా ఉంచాలి.

పచ్చిమిరపకాయల కూర



కావలసినవి
లావు పచ్చిమిరపకాయ- పావు కిలో
ఉల్లిగడ్డ-
1
జీలకర్ర -
1 టీ స్పూన్
నువ్వులు-
2 టీ స్పూన్
కరివేపాకు-
రెండు టేబుల్ స్పూనులు
పసుపు-
1/2 టీ స్పూన్
కారం-
1 టీ స్పూన్
ధనియాలపొడి-
1 టీ స్పూన్
కొబ్బరి తురుము-
1 టేబుల్ స్పూను లు
అల్లం వెల్లులి పేస్ట్-
2 టీ స్పూనులు
చిరొంజి(గుమ్మడి లేదా దోస కాయల గింజలు
)-
1 టేబులు స్పూన్
నిమ్మకాయంత చింతపండు(వేడినీటిలో నానబెట్టాలి)
ఉప్పు,నూనె -
తగినంత

తయారి
1.
ఉప్పు నీటిలో పచ్చిమిరపకాయలు వేసి రంగు విరిగే వరకు వేడి చేసి పక్కన ఉంచుకోవాలి.
2. నువ్వులు,గింజలు,తురిమిన కొబ్బరిని తేలిగ్గ వేయించి పేస్ట్ తయారుచేసుకోవాలి.
3. ఈ పేస్టుకు ధనియాలపొడి,కారం,పసుపు కలపాలి. పాత్రలో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడాక మసాలా,అల్లం వెల్లులి పేస్ట్ కలిపి నూనె విడివడే వరకు వేయించాలి.
4. ఉండికించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు,కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
5. చింతపండు నీరు పోసి,సెగ తగ్గించి చిక్కబడే వరకు ఉడకనివ్వాలి.
6.ఇది బిర్యానికి మంచి కాబినేషన్.

బీన్స్ ఫ్రై





కావలసినవి
బీన్స్ ముక్కలు-
2 కప్పులు
ఆవాలు-
1 టీ స్పూన్
కరివేపాకు- రెండు టేబుల్ స్పూనులు
పసుపు-
1 టీ స్పూన్
కారం-
1 టీ స్పూన్
ధనియాలపొడి- 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయల ముక్కలు-
1 టేబుల్ స్పూన్
కొబ్బరి తురుము-
రెండు టేబుల్ స్పూను లు
నూనె-
డీప్ ఫ్రై కి తగినంత
టొమాటో-
1

తయారి
1.
మూకుడు లో నూనె వేడిచేసి ఆవాలు వెయ్యాలి.చిటపటలాడాక కరివేపాకు,బీన్స్ ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి.
2. ఇప్పుడు పొడులు,పచ్చిమిరపకాయ ముక్కలు,బీన్స్ వేసి ఒక నిమిషం వేయించాలి
3. మూతపెట్టి బీన్స్ మెత్తపడే వరకు ఉడికించాలి.
టొమేటో ముక్కలు,కొబ్బరి తురుము వేసి మరో అయిదు నిమిషల పాటు వేయించాలి.కొత్తిమీరతో గార్నిష్ చేసుకొవాలి.

టొమాటో దోస



తయారి సమయం: 3 గంటలు
కావలసినవి

బియ్యం- అర కప్పు (రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి)
మినపప్పు-
పావు కప్పు
టొమాటో- రెండు(తరగాలి)
పచ్చి కొబ్బరి తురుము - రెండు టెబుల్ స్పూన్లు
ఎండుమిర్చి- రెండు(మధ్యలోకి విరిచి గింజలు తీసేయాలి)
బెల్లం తురుము-
2 టబుల్ స్పూన్లు
తరిగిన కొత్తిమీర-
1 టబులె స్పూన్
ఉప్పు -
రుచికి తగినంత
నూనె-
సరిపడినంత

తయరీ
1
.నానబెట్టుకున్న బియ్యం,పప్పుని రుబ్బుతూ ఒక మొస్తారుగా మెదిగిన తరువాత కొబ్బరి,టొమాటో,బెల్లం,కొత్తిమీర,ఉప్పు,ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
2. పెనం వేడయ్యాక,నూనె రాసి,రుబ్బుకున్న పిండితో దోసె వేసి,వెంటనే చుట్టు నూనె వేసి 20 సెకన్లపాటు ఉంచి, తిరగేసి వెనక వైపు కూడా లేత బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చాలి.

తీపి గారెలు





తయారి సమయం: 2 గంటలు
కావలసినవి
మినపప్పు-
ఒక కప్పు
బెల్లం తురుము-
1 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా


తయరీ
1.
రెండు గంటల ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి.
2. పప్పులో నీళ్ళని వడగట్టేసి,ఉప్పుని జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి.రుబ్బుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోయకూడ్దు. అలా పోస్తే గారెలు నూనెను బాగా పీలుచ్తాయి.
3. పాత్రలో నీళ్ళు వేడయ్యాక బెల్లం తురుము వేసి,చిక్కగా పాకం వచ్చేవరకు ఉంచి దింపేయాలి.
4. పాత్రలో నూనె వేడయ్యాక,చేతిని కొద్దిగా నీటితో త
డుపుకుని పిండిని చిన్న ఉండగా తీసుకుని అరచేత్తో వత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
5. నూనె లొంచి తీసిన గారెలను వెంటనే బెల్లం పాకంలో వేయాలి. మరోసారి ఫ్రై చేసుకునే వరకు ముందుగా వేసిన గారెలను పాకంలోనే ఉంచి తీసేయాలి.
7. కొంత పాకాన్ని పక్కన పెట్టుకుని తినే ముందు గారెల పై వేసి వేడివేడిగా వడ్డించాలి.

వెజ్ ఫ్రైడ్ రైస్





తయారి సమయం: 40 నిమిషాలు
కావలసినవి
అన్నం -
4 కప్పులు
ఉల్లి కాడలు- రెండు(సన్నగ తరిగి పెట్టుకోవాలి)
కూరగాయ ముక్కలు:క్యారట్,క్యాబేజి,బీన్స్(రెండు నిమిషాలు ఉడికించి తీసేయాలి)-అన్నీ కలిసి రెండు
కప్పులు
వెనిగర్-
ఒక టీ స్పూన్
మిరియాలపొడి,ఉప్పు -
రుచికి తగినంత
నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్


తయరీ
1.
పాత్రలో నూనె వేడయ్యాక,ఉల్లి కాడలు వేసి పెద్ద మంటపై ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
2. ఆ తరువాత కూరగాయ ముక్కలని జతచేసి మరో మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
3. ఫ్రై చేసుకున్న మిశ్రమానికి మిరియాలపొడి,ఉప్పు వేసి కలిపి,మరో నిమిషం పాటు పెద్ద మంటపై వేగనివ్వాలి. ఆ తరువాత అన్నాన్ని వేసి కలీయబెట్టి మరో నిమిషం పాటూంచాలి.
4. చివరగా వెనిగర్ ని వేసి 30 సెకన్ల పాటు ఉంచి మంటని తీసేయాలి. సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.

కోబ్బరి ఆలు రైస్



తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి
బియ్యం- 2 కప్పులు(కడిగి నానబెట్టుకోవాలి)
పచ్చి కొబ్బరి తురుము-
అర కప్పు
ఆలు-
4 తరిగినవి
పచ్చి మిర్చి-
4 నిలువుగా తరగాలి
నెయ్యి-
1 టేబుల్ స్పూన్
జీలకర్ర-
1/2 టీ స్పూన్
లవంగాలు-
8
ఏలకులు-
4
దాలిచిన చేక్క-
4
ఉప్పు-
తగినంత
ఎండుమిర్చి-2 (మధ్యకి విరిచి గింజలు తీసేయాలి)
శనగపప్పు-
1 టీ స్పూన్
మినపప్పు-
1/2 టీ స్పూన్
కరివేపాకు-
మూడు రెబ్బలు
నీళ్ళు- నాలుగు కప్పులు
తయరీ
1.
పాత్రలో నెయ్యి వేడయ్యాక,జీలకర్ర,మినపప్పు,శనగపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
2. పచ్చిమిర్చి,ఎండుమిర్చి,దాలిచిన చేక్క,ఏలకులు వేసి రెండు నిమిషాలు వేయించుకున్నాక,ఆలు ముక్కలు జత చేసి 3 నిమిషాలు పాటు వేయించాలి.
3. వడ కట్టుకున్న బియ్యాన్ని జత చేసి బాగా కలపాలి.కొబ్బరి తురుము,కరివేపాకు,ఉప్పు వేసి కలియబెట్టాలి.
4. నీళ్ళన్ని పోసి కలియబెట్టి,మూత పెట్టి దాదాపుగా 20 నిమిషాల పాటు, అన్నం అయ్యేవరకు ఉడికించి దింపేయాలి.

మిక్సుడ్ వెజిటేబుల్ కర్రీ



తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి
ఉల్లిపాయ ముక్కలు -
2 కప్పులు
క్యాలీప్లవర్,ఆలూ,టొమాటో ముక్కలు- ఒక్కొక్క కప్పు
బీన్స్ ముక్కలు,బఠాణి-
అర కప్పు
అల్లం,వెల్లులి పేస్ట్-
1 టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి-
4 నిలువుగా తరగాలి
జీలకర్ర-
1 టీ స్పూన్
లవంగాలు-
3
ఏలకులు-
4
దాలిచిన చేక్క-
2
కారం,థనియాలపొడి,గరం మసాలాపొడి-
ఒక్కొక్క టీ స్పూన్
పసుపు-
చిటికెడు
ఉల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
(ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పేస్ట్ చేసుకోవాలి)
పెరుగు,టొమాటో పేస్ట్-
2 టేబుల్ స్పూన్లు
ఉప్పు-
తగినంత
కొత్తీమీర-గార్నిష్ కి సరిపడా
జీడిపప్పు పేస్ట్-
2 టేబుల్ స్పూన్లు
నూనె -
2 టేబుల్ స్పూన్లు
తయరీ
1.
కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసి ఉడికించాలి. పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర,మసాలా దినుసులు,పసుపు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.అల్లం వెల్లులి,కారం,ధనియాలపొడి,ఉప్పు వేసి కలియబెట్టాలి
2. టొమాటో ముక్కలని వేసి 5 నిమిషాల వరకు వేయించి ఉడకబెట్టుకున్న కూరగాయముక్కల్ని వేసి కలిపి మూతపెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.
3. టొమాటొ,ఉల్లి,జీడిపపు పేస్ట్,పెరుగు వేసి కలిపి మూతపెట్టి మగ్గిన తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించి చివరగా గరం మసాలా పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

ఉల్లి పచ్చడి



కావలసినవి
ఉల్లిగడ్డలు- 2 పెద్దవి
ఎండు మిర్చి-
3(మధ్యలోకి విరిచి,గింజలు తీసేయాలి)
జీలకర్ర-
అర టేబుల్ స్పూన్
మినపప్పు-
1 టీ స్పూన్
ఉప్పు-
రుచికి తగినంత
చింతపండు-
నాలుగు రేకులు
బెల్లం-
అర టీ స్పూన్
పసుపు-
చిటికెడు
నూనె-
2 టీ స్పూన్
పోపు కోసం:
ఆవాలు-
1 టీ స్పూన్
కరివేపాకు-
ఒక రెబ్బ
నూనె-
అర టీ స్పూన్
తయరీ
1.
పాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేడయ్యక,జీలకర్ర,ఎండు మిర్చి వేసి వేయించాక,మినపప్పు రెడ్ కలర్ వచ్చేవరకు వేయించుకుని దింపేసి చల్లార్చాలి.
2. అదే పాన్ లో మరో టీ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయల్ని 5 నిమిషాల పాటు వేయించుకుని దింపుకోవాలి.
3. ముందుగా మినపప్పుని,ఎండుమిర్చిని గ్రైండ్ చేసి, ఆ తరువాత ఉల్లిపాయల్ని జతచేసి,ఉప్పు,బెల్లం,చింతపండుని జతచేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4. పానులో నూనె వేడయ్యాక పోపు దినుసులని,పసుపు వేసి చిటపటలాడించి కరివేపాకుని వేసి,గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసి కలియబెట్టి మంట తీసేయాలి.

చికెన్ లివర్ - పెప్పెర్ ఫ్రై





కావలసినవి

చికెన్ లివర్ - పావు కిలో
కరివేపాకు పొడి- 1 స్పూన్

అల్లం,వెల్లులి పేస్ట్- 2 స్పూన్స్
మిరియాల పొడి-
1/2 స్పూన్
దాల్చినచెక్క పొడి-
1 స్పూన్
గరం మసాలా పొడి-
1 స్పూన్
ఉప్పు,నూనె-
తగినంత


తయరీ
1
.చికెన్ లివరును శుభ్రంగా కడిగి,చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2. నూనె వేడిచేసి అల్లం,వెల్లులి పేస్ట్,కరివేపాకు పొడి,మిరియాల పొడి,ఉప్పు వేయాలి.రెండు నిమిషాల తరువాత లివర్ ముక్కలను వేయాలి.
3. ముక్కలు ఎరుపురంగు వచ్చేవరకు తక్కువ మంటమీద వేయించాలి. దాల్చినచెక్క పొడి,గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
4. మరో ఐదు నిమిషాలు వేయించి దించేసుకోవాలి.

చికెన్ 65



కావలసినవి

బొనులెస్స్ చికెన్- పావు కిలో
మజ్జిగ- 1 కప్పు
కోడిగుడ్లు
- 2
మొక్కజొన్న పిండి
- 2 స్పూన్స్
బియ్యం పిండి
- 2 స్పూన్స్
అల్లం,వెల్లులి పేస్ట్- 2 స్పూన్స్
నిమ్మరసం
- 2 స్పూన్స్
కారం
- 1 స్పూన్
మిరియాల పొడి- 1/2 స్పూన్
ఫూడ్ కలర్
- కొద్దిగా
ఉప్పు,నూనె
- తగినంత

తయరీ

1.చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, కారం,మిరియాల పొడి,ఉప్పు కలిపి అరంగంట పాటు ఉంచాలి.
2. తరువాత ఓ గిన్నెలో మొక్కజొన్న పిండి,బియ్యం పిండి,కోడిగుడ్డు సొన వేసి బాగా కలిపి, చికెన్ ముక్కలను కూడా వేయాలి.
3. నూనె వేడి చేసి మజ్జిగ,ఫూడ్ కలర్, ఉప్పు వేయాలి.మజ్జిగ బాగా మరుగుతుండగా చికెన్ ముక్కలను వేసి మూత పెట్టాలి.
4. మజ్జిగంతా ఇరిగి పోయి ముక్కలు పొడిపొడిగా అయ్యేవరకూ ఉడికించి దించేసుకోవాలి.
5. చల్లారక నిమ్మరసం చల్లుకోవాలి.

చికెన్ మసాలా బాల్స్




కావలసినవి

బొనులెస్స్ చికెన్- అర కిలో
జీడిపప్పు
- 1/4 కిలో
ఉల్లిపాయ
- 1/4 కిలో
పచ్చిమిర్చి
- 10
ఎండుమిర్చి
- 6
అల్లం,వెల్లుల్లి పేస్ట్
- 2 స్పూన్
ధనియాలు- 1 స్పూన్
జీలకర్ర- 1 స్పూన్
లవంగాలు- 4
యాలకులు
- 3
దాల్చినచెక్క
- చిన్నది
ఉప్పు,నూనె
- తగినంత

తయారీ

1. నూనె వేడి చేసి జీలకర్ర,ధనియాలు,యాలకులు,లవంగాలు,దాల్చినచెక్క,జీడిపప్పు వేయించి తీయాలి.
2. చల్లారిన తరువాత వీటికి, అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి,ఉల్లిపాయలు,చికెన్,ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
3. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

చికెన్ రోల్స్



కావలసినవి
మైదా పిండి- 1 కప్పు
చికెన్ ముక్కలు
- 1 కప్పు
కోడిగుడ్లు
- 1
ఉల్లిపాయ
- 1
టొమాటో
- 1
పచ్చిమిర్చి
- 2
అల్లం,వెల్లుల్లి పేస్ట్
- 1 స్పూన్
గరం మసాలా- 1 స్పూన్
కారం
- 1 స్పూన్
ఉప్పు,నూనె
- తగినంత


తయారీ

1. చికెన్ ఉడికించి పక్కన పెట్టలి.మైదా పిండిలో నీరు,ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి.
2. ఈ పిండితో చపాతీలు చేసుకోవాలి.
3. నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లులి పేస్ట్ వేయాలి. వేగాక టొమాటో ముక్కలు, చికెన్ ముక్కలు వేయాలి.
4. కాసేపు వేయించాక పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పు,గరం మసాలా వెయ్యాలి. మరూ రెండు నిమిషాలు వేయించి దించేసుకోవాలి.
5. ఇప్పుడు చపాతిని తీసుకుని,దానిపైన కోడిగుడ్డు సొనను రాయాలి.
6.వెయించి పెట్టుకున్న మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టి రోల్ చేయాలి. ఇలా చేసిన రోల్సును ఒవెన్లో పెట్టి బేక్ చెయ్యలి.ఒవెన్ లేనివాళ్ళు లోపలి మిశ్రమం బయటికి రాకుండా రోల్స్ ను మూసి నూనె లో డీప్ ప్రై చేసుకోవచ్చు

సొరకాయ హల్వా




కావలసినవి
లేత సొరకాయ తురుము
- ఒక కప్పు
చక్కర-1 కప్పు
కోవా- 100 గ్రా
నెయ్యి
- 2 టేబుల్ స్పూన్లు
ఫూడ్ కలర్(గ్రీన్)-
చిటికెడు
ఏలకుల పొడి
-1/4 టీ స్పూన్
గార్నిష్ కోసం
- పిస్తా,సొరకాయ పప్పు


తయారి
పాన్ లో నెయ్యి వేసి వేడయ్యక,సొరకాయ తురుముని వేసి పచ్చి వాసన పొయేవరకు వేయించుకోవాలి. తరువాత వేగిన తురుమును కోవా,ఫూడ్ కలర్ ను వేసి వేయించాలి.
ఉడికాక చక్కర వేసి దగ్గరకు వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి.
హల్వా ముద్దలా అయ్యాక దింపేసి ఏలకుల పొడి వేసి పిస్తా,సొరకాయ పప్పు తో గార్నిష్ చేసుకోవాలి.

బీటురూట్ హల్వా



కావలసినవి
బీటురూట్ తురుము- ఒక కప్పు
చక్కర-1/2 కప్పు
పాలు
- 1/2 కప్పు
నెయ్యి
- 2 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి
-1/4 టీ స్పూన్
గార్నిష్ కోసం
- కాజు

తయారి

పాన్ లో నెయ్యి వేసి వేడయ్యక,బీటురూట్ తురుముని వేసి పచ్చి వాసన పొయేవరకు వేయించుకోవాలి. తరువాత వేగిన తురుమును పాలలో ఉడికించుకోవాలి.
ఉడికాక చక్కర వేసి దగ్గరకు వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి.
హల్వా ముద్దలా అయ్యాక దింపేసి ఏలకుల పొడి వేసి కాజూతో గార్నిష్ చేసుకోవాలి.

ఆలూ హల్వా



కావలసినవి
ఆలూ
- 1/4 కేజి
చక్కర
-1 కప్పు
పాలు- 1/2 కప్పు
నెయ్యి
- 2 టేబుల్ స్పూన్లు
గార్నిష్ కోసం
- కాజు


తయారి

ముందుగా ఆలుగడ్డని నీళ్ళలో ఉండికించుకోవాలి. తొక్క తీసేసి,చిదుముకుని నేతిలో వేయించాలి.
తరువాత పాలు,చక్కర వేసి దగ్గరగా వచ్చేవరకు ఉడకనివ్వాలి.
చివరగా ఏలకుల పొడి వేసి దింపేసుకోవాలి.
కాజూతో గార్నిష్ చేసుకోవాలి.

రత్నపురిగడ్డ(చిలగడ దుంప) హల్వా



కావలసినవి
రత్నపురిగడ్డ(చిలగడ దుంప)-
1/2 కేజి
చక్కర
-1 కప్పు
ఏలకులపొడి-1/4 టీ స్పూన్
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
గార్నిష్ కోసం- కాజు

తయారి

ముందుగా రత్నపురిగడ్డని నీళ్ళలో ఉండికించుకోవాలి. తొక్క తీసేసి,చిదుముకుని నేతిలో వేయించాలి.
దగ్గరగా వచ్చిన ముద్దకు చక్కర జతచేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
చివరగా ఏలకుల పొడిని వేసి దింపేసి,కాజూతో గార్నిష్ చేసుకోవాలి.

క్యాబేజ్ హల్వా



కావలసినవి
క్యాబేజ్ తురుము- ఒక కప్పు
చక్కర-1/2 కప్పు
ఏలకులపొడి-1/4 టీ స్పూన్
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
గార్నిష్ కోసం
- కాజు


తయారి
పాలు,నీళ్ళు సమానంగా తీసుకుని అందులో క్యాబేజ్ తురుము వేసి ఉడికించుకోవాలి. ఆ తరువాత పాలునీళ్ళని వడకట్టి తురుమును నేతిలో వేయించుకోవాలి.
లేత బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకున్న తరువాత చక్కర వేసి,మంట సన్నగా పెట్టి అడుగంటకుండా కలుపుతుండాలి.
మిశ్రమం అంతా దగ్గరగా వచ్చాక ఏలకుల పొడి వేసి దింపేయాలి.
కాజుతో గార్నిష్ చేసుకోవాలి.

మామిడి హల్వా



కావలసినవి
మామిడికాయ తురుము- ఒక కప్పు
చక్కర-1/2 కప్పు
ఏలకులపొడి-1/4 టీ స్పూన్
జాపత్రి,కుంకుంపువ్వు- చిటికెడు


తయారి
మామిడికయ చెక్కు తీసుకుని తురుముకోవాలి.
పాన్ లో మామిడి తురుము,చక్కర ఒకేసారి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చెవరకు వేయించుకోవాలి.
ఆ మిశ్రమం దగ్గరగా అయ్యెవరకు కలుపుతూనే ఉండాలి.
చివరగా జాజికాయ,జాపత్రి,కుంకుంపువ్వు వేసి అయిదు నిముషాలుంచి దింపేసుకోవాలి.ఈ హల్వా ఏడాది పాటు నిల్వ వుంటుంది.

రోజ్ హల్వా



కావలసినవి
గులాబీ రేకులు
- ఒక కప్పు
రొజ్ వాటర్- 1/2 కప్పు
తేనె- 2 టేబుల్ స్పూన్లు
చక్కర-1/2 కప్పు
ఏలకులపొడి-1/4 టీ స్పూన్
గార్నిష్ కోసం -జీడిపప్పు

తయారి
ముందుగా గులాబీ రేకులను తేనె,రోజ్ వాటర్ లో ఉడికించుకోవాలి.ఉడికిన మిశ్రమానికి చక్కర జత చేసి దగ్గరికి వచ్చేవరకు ఉడికించుకోవాలి.చివరగా ఏలకుల పొడి వేసుకుని దింపి,జీడిపప్పుతో గార్నిష్ చేయాలి

మలై పూరీ

కావలసినవి
పాలు
-3 లిటర్లు
చక్కర-ఒక కప్పు
గార్నిష్ కోసం -పిస్తా,బాదం
తయారి
పాలను బాగా మరిగించి తరువాత మూతపెట్టకుండా పాత్రను కదిలించకుండా అలాగే ఉంచితే కొద్ది సేపటికి మీగడ మందంగా తయారవుతుంది.దాదాపు రెండు లేదా మూడు గంటల సేపటికి మీగడ అట్టులా పేరుతుంది.అప్పుడు పాత్ర అంచులకు అంటుకుని ఉన్న మీగడ పొరను చాకుతో కాని స్పూన్ తో కాని కట్ చేయాలి.వెడల్పాటి చిల్లుల గరిటె తో మీగడ మడతపడకుండా పొరలాగా వచ్చేటట్లు తీసి మీగడ మీద ఆకు వేసి గరిటేను తిరగేస్తే మీగడ పొర దోసెలాగా ఆకులో కి వస్తుంది. దానిని త్రిభూజాకారంలో ముక్కలూగా కట్ చేయాలి. ఒక ముక్క మిద్ద చక్కర చల్లాలి.అలాగే చక్కర చల్లిన మరొక ముక్కను మొదటి ముక్క మీద బొర్లించాలి.ఇప్పుడు రెండు మీగడ పొరల మీద చల్లిన చక్కర మధ్యలో ఉంటుంది,పైన అల్యూమినియం ఫాయిల్ వేసి బాదం,పిస్తా తో గార్నిష్ చేయాలి.

రబ్డీ

కావలసినవి
పాలు
-5 లిటర్లు
చక్కర-ఒక కేజి
ఏలకుల పొడి-ఒక టీ స్పూన్
కుంకుంపువ్వు- చిటికెడు
తయారి
రబ్డీ పాన్ లు విడిగా దొరుకుతాయి. వాటికి బదులుగా ఎత్తు తక్కువగా ఉన్న బాణిలో పాలు పొసి మూడు నుంచి నాలుగు పొంగులు వచ్చాక మంట తగ్గించాలి.అప్పుడు మీగడ తేలుతుంది. దానిని చిల్లుల గరిటెతో తీసి పక్కన ఉంచాలి.అలా దాదాపుగా గంట సేపు సన్న మంట మీద మరిగించి మీగడ తీసుకూవాలి.పాలు దగ్గరయాక చక్కర కలిపి,కరిగిన తరువాత దించ్యేయాలి.ఈ పాలలో ఏలకుల పొడి,కుంకుంపువ్వు కలిపి ముందుగా తీసి ఉంచిన మీగడ వేసి కలపాలి.దీనిని అరగంట సేపు ప్రీజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.

రవ్వ కేసరి

కావలసినవి
రవ్వ-100 గ్రాములు
చక్కర-100 గ్రాములు
నెయ్యి-50 గ్రాములు
వేడి నీరు-రెండు గ్లాసులు
ఏలకుల పొడి-పావు టీ స్పూన్
కుంకుంపువ్వు- చిటికెడు
గార్నిష్ చేయాడానికి-జీడిపప్పు
కిస్మిస్-కొద్దిగా
తయారి
రవ్వను నేతిలో దోరగా వేయించి చక్కర కలపాలి.అందులో మరుగుతున్న నీటిని పొసి,అందులో కుంకుంపువ్వు,ఏలకుల పొడి వేసి కలుపుతూ ఉడికించి దగ్గరగా అయ్యక దించి జీడిపప్పు తో గార్నిష్ చేయాలి.

ఖీర్

కావలసినవి
పాలు-అర లీటరు
చక్కర-100 గ్రాములు
ఏలకుల పొడి-పావు టీ స్పూన్
గార్నిష్ చేయాడానికి-జీడిపప్పు
కిస్మిస్-కొద్దిగా
నెయ్యి-వెయించడానికి తగినంత
తయారి
పాలను బాగా మరిగించి చక్కర,ఏలకుల పొడి వేసి మరికొంత సేపు కాగనివ్వలి.చిక్కబడిన తరువాత సెమీయ వేసి కలిపి, నెథిలో వేయించిన జీడిపప్పు,కిస్మిస్ తో గారిన్ష్ చేసి సర్వ్ చేయాలి.

కాజు బర్ఫి

కావలసినవి
చక్కర- 300 గ్రాములు
జీడిపప్పు-అర కేజి
ఏలకులపొడి- అర టీ స్పూన్
నెయ్యి-అర కప్పు
తయరీ
1. జీడిపప్పును కడిగి గంట సేపు నానబెట్టాలి. ఒకవేళ పొట్టు అలాగే ఉంటే నానిన తరావాత దానిని తీసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.దీనిని కాజుకోవా అంటారు.
2.ఈ కాజుకోవాను బాణిలిలో వేసి గరిటెతో కలుపుతూ వేడి చేయాలి.అంతా సమంగా వేడెక్కి దోరగా వేగిన తరువాత చక్కర,ఏలకులపొడి వేయాలి.
3. మరలా కలుపుతూ అడుగుకు అంటుకోకుండా మిశ్రమం దగ్గర అయ్యెవరకు మరిగించి దించేయాలి. ఒక పిట మిద నెయ్యి రాసి జీడిపప్పు మిశ్రమాన్ని వేసి పూరీలు ఒత్తే కర్రతో రోల్ చేయాలి
4.మిశ్రమన్ని,అంతా సమనంగా ఒకే మందంగా అయిన తరువాత కావలిసిన ఆకారంలో కట్ చేయాలి

కేసర్ పేడా

కావలసినవి
పాలు- ఒక లీటరు
చక్కర- 500 గ్రాములు
కుంకుమపువ్వు- 5 గ్రాములు
ఏలకులపొడి- 5 గ్రాములు
జాపత్రి,జాజికాయ పొడి - 5 గ్రాములు
తయరీ
1. పాలలొ చక్కర, ఏలకుల పొడి వేసి దగ్గర అయ్యేవరకు మరిగించాలి.
2. కోవా అయ్యాక జాపత్రి,జాజికాయ పొడి, ఏలకులపొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
3. ఇ మిశ్రమాన్ని చేత్తో కాని పూరీల కర్రతో కాని వత్తి అంతా సమంగా మెదిపి కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండుగా చేయాలి.
4. కావాలంటే పిస్తాతో గారినిష్ చేయవచ్చు.

ఆగ్రా పాన్

కావలసినవి
బూడిద గుమ్మదికాయ- చిన్న ముక్క
సున్నం- చిటికెడు
కలాకండ కోసం పాలు- ఒక లీటరు
చక్కర- 100 గ్రాములు
గ్రీన్ కలర్- చిటికెడు
లవంగాలు-పది
పిటకడి- చిటికెడు
తయరీ
1. పాలను ముప్పావు అయ్యెవరకు మరిగించి పిటకడి వేస్తే కొద్దిగా లూజు అవుతాయి.
2. క్రీములా అయ్యెవరకు కలియబెడుతూ మరగించి దించి ట్రేలోకి వంపి చల్లారనివ్వాలి.
3. దీనీని కలాకండ్ అంటారు,పాన్ లొ స్టఫింగుకి వాడతారు.
4.బూడిద గుమ్మదికాయను మరి పలూచగ కాకుండా మందపాటి పొరలాగా కట్ చేయాలి.
5. ఆ పొరను పాన్ మౌల్డ్ తో కాని చాకుతో కాని త్రిభుజాకారంగా కత్ చేయాలి.
6.వీటీని సున్నం కలిపిన నీటిలో వేసి అరగంట తరువాత కడగాలి.
7.చక్కర నీటిలో గ్రీన్ కలర్ కలిపి మరిగించి గుమ్మదికాయ ముక్కలతో చేసిన ఆకులను వేసి ఉడికించి దించేయాలి.
8. పాన్ కావాలన్నప్పుడు చక్కర పాకంలో నుంచి ఆకు తీసి కలాకన్ పెట్టి మడతపెట్టి లవంగం గుచ్చితే ఆగ్రా పాన్ రెడీ

హీనా


కావలసినవి
పాలు- ఒక లీటరు
చక్కర- ఒక కేజీ
నిమ్మరసం- ఒక టి స్పూన్
తయరీ
1. పాలలొ నిమ్మరసం వేసి మరిగించి విరిగాక పలుచటి క్లొత్ లో కట్టాలి.
2. నీరంతా పొయాక పాల విరుగు ను పూరీల పీట మీద మెత్తగా అయ్యే వరకు వత్తాలి.
3. ఒక పాత్రలో అరకేజి చక్కర,కొద్దిగా నీరు వేడి చేయాలి
4. కరిగేలోపుగా పనీర్ ను కొద్దిగా చేతిలోకి తీసుకుని బాల్ లాగ చేసి కాస్త నొక్కి పోడవుగా రౌండ్ ఆకారం వచ్చేటట్లు చేసి మరుగుతున్న చక్కర నీటిలో వేయాలి ఇలా అన్నింటీనీ అరగంట సేపు ఉడికించాలి.
5. మరొక పాత్రలో అర కేజీ చక్కర వేసి పాకం పట్టి, చక్కర ద్రావణంలో ఉడికిన వాటిని తీసి పక్కనున్న చక్కర పాకంలో వేసి అలాగే ఉంచాలి.
6. సర్వు చేసె ముందు పాకంలో నుంచి తీసి క్రీము,పిస్తాలతో గార్నిష్ చేయాలి.

మోతీ చూర్ లడ్డు



కావలసినవి
శనగపిండి- పావు కిలో
చక్కర-పావు కిలో
కుంకుమ పువ్వు- చిటికెడు
ఏలకుల పొడి- అర టిస్పూన్
నెయ్యి-150 గ్రాములు
తయారి
1. శనగపిండిలో కుంకుమ పువ్వు ఏలకుల పొడి వ్వెసి తగినంత నీటితో జారుడుగా కలపాలి.
2. ఒక గిన్నెలో చక్కర వెసి పాకం పట్టాలి.
3. బాణిలో నెయ్యి వెసి కాగిన తరువతా సన్న చిల్లున్న గరిటె మీద కలిపిన శనగపిండిని వెసి చిన్న గిన్నెతో రుద్దితే సన్నని బూందీ నెతిలోకి జారుతుంది.
4. దానిని మరొక చిల్లుల గరిటెతో రెండు-మూడు సార్లు నెతిలో ముంచి దోరగా కాలిన తరువాత తీసి చక్కర పాకంలొ వెసి కలపాలి.
5. మిశ్రమం వెడి తగ్గిన తరువాత చెత్తొ లడ్డూలు కట్టాలి
6. కావలంటె పిస్తాతొ అలకరించుకొవచ్చు, ఏలకుల పొడి చిల్లులకు అడ్డం పడుతుందనుకుంటె చక్కర పాకంలొ వెయవొచ్చు.
Your Ad Here

CURRYS - ZONE

SNACKS - ZONE

SWEETS - ZONE

క్యాప్సికం-బఠానీ కూర టొమాటో దోస సొరకాయ హల్వా రబ్డీ
గుమ్మడికాయ కూర వెజ్ ఫ్రైడ్ రైస్ బీటురూట్ హల్వా రవ్వ కేసరి
   కోడిగుడ్డు ములక్కాడ కోబ్బరి ఆలు రైస్ ఆలూ హల్వా ఖీర్
ఉల్లి పచ్చడి చికెన్ లివర్ - పెప్పెర్ ఫ్రై రత్నపురిగడ్డ(చిలగడ దుంప) హల్వా కాజు బర్ఫి
పచ్చిమిరపకాయల కూర చికెన్ మసాలా బాల్స్ క్యాబేజ్ హల్వా కేసర్ పేడా
బీన్స్ ఫ్రై చికెన్ రోల్స్ మామిడి హల్వా ఆగ్రా పాన్
మిక్సుడ్ వెజిటేబుల్ కర్రీ   రోజ్ హల్వా హీనా
చికెన్ 65   మలై పూరీ మోతీ చూర్ లడ్డు