
తయారి సమయం: 2 గంటలు
కావలసినవి
మినపప్పు- ఒక కప్పు
బెల్లం తురుము- 1 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
తయరీ
1.రెండు గంటల ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి.
2. పప్పులో నీళ్ళని వడగట్టేసి,ఉప్పుని జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి.రుబ్బుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోయకూడ్దు. అలా పోస్తే గారెలు నూనెను బాగా పీలుచ్తాయి.
3. పాత్రలో నీళ్ళు వేడయ్యాక బెల్లం తురుము వేసి,చిక్కగా పాకం వచ్చేవరకు ఉంచి దింపేయాలి.
4. పాత్రలో నూనె వేడయ్యాక,చేతిని కొద్దిగా నీటితో త
డుపుకుని పిండిని చిన్న ఉండగా తీసుకుని అరచేత్తో వత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
5. నూనె లొంచి తీసిన గారెలను వెంటనే బెల్లం పాకంలో వేయాలి. మరోసారి ఫ్రై చేసుకునే వరకు ముందుగా వేసిన గారెలను పాకంలోనే ఉంచి తీసేయాలి.
7. కొంత పాకాన్ని పక్కన పెట్టుకుని తినే ముందు గారెల పై వేసి వేడివేడిగా వడ్డించాలి.
No comments:
Post a Comment